2020 సంవత్సరం నవంబర్ నెల నుంచి దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతునన్నాయి. మజుగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొత్తం 62 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 10వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరితేదీగా ఉంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవాళ్లకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలలో ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్ ఉద్యోగాలు 27 ఉండగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో పాస్ అయిన వాళ్లు షిప్‌బిల్డింగ్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ గా సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజిన్ డ్రైవర్ ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలకు మర్కంటైల్ మెరైన్ విభాగం జారీ చేసినా సర్టిఫికెట్ ఉండాలి.
ఇంజిన్ డ్రైవర్‌గా అనుభవం ఉండటంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…