నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. మజుగావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్‌లో భారీ వేతనంతో ఉద్యోగాలు..?

0
90

 

2020 సంవత్సరం నవంబర్ నెల నుంచి దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతునన్నాయి. మ‌జుగావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొత్తం 62 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 10వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరితేదీగా ఉంది.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవాళ్లకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగాలలో ఎల‌క్ట్రిక‌ల్ క్రేన్ ఆపరేటర్స్ ఉద్యోగాలు 27 ఉండగా నేష‌న‌ల్ అప్రెంటిస్‌షిప్ స‌ర్టిఫికెట్ ఎగ్జామినేష‌న్ ఎల‌క్ట్రీషియ‌న్ ట్రేడ్ లో పాస్ అయిన వాళ్లు షిప్‌బిల్డింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ గా సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజిన్ డ్రైవ‌ర్ ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలకు మ‌ర్కంటైల్ మెరైన్ విభాగం జారీ చేసినా సర్టిఫికెట్ ఉండాలి.

 

ఇంజిన్ డ్రైవ‌ర్‌గా అనుభవం ఉండటంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here