NTR : వైసీపీ ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ ఫోటో… పాత ఫోటో అయినా మళ్ళీ వైరల్..!

NTR : గత కొన్నేళ్లుగా రాజకీయారంగు పూసుకోకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు చేరువ అవుదామని ఎన్టీఆర్త ఎంత అనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఎన్టీఆర్ ను పాలిటిక్స్ లోకి లాగుతునే ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేసిన చిన్న ఎన్టీఆర్ ఆ తరువాత కారణాలు ఏవైనా అటు వైపు చూడడం లేదు. అయితే ఎన్టీఆర్ కి ఆప్తులు అనగానే ఎన్టీఆర్ గురించి బాగా తెలిసిన ఎవరైనా చెప్పే పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇద్దరికి టీడీపీ లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పించి కొడాలికి ప్రచారం కూడా చేసాడు ఎన్టీఆర్. వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీ లోకి ఎన్టీఆర్ రాకముందు నుండే స్నేహితులు.

కొడాలి, వల్లభనేని వైసీపీ లోకి వెళ్ళాక దూరం…

ఒకానొక సందర్బంలో వినాయక్ కూడా వీళ్ళ స్నేహం గురించి చెప్పాడు. ఎన్టీఆర్ దిల్ సినిమా వద్దు అనుకోడానికి కొడాలి నాని కారణం అని, కొడాలి నాని స్టోరీ విని ఎన్టీఆర్ కు మొదట్లో కథల ఎంపిక లో సహాయం చేసేవాడు. ఇక కొడాలి నాని, వల్లభనేని ఇద్దరూ ఎన్టీఆర్ తో సినిమాలను కూడా నిర్మించారు. ఇక రాజకీయాల్లో వైసీపీ లోకి ఇద్దరూ వెళ్ళాక ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. ఆప్తులే అయినా వాళ్ళ తాత పార్టీ లో లేకపోవడం వల్ల అది తనకు ఇబ్బంది కలిగిస్తుందనేమో రాజకీయాలవైపు అసలు చూడటం లేదు. టికెట్ రేట్ల విషయంలో మహేష్, ప్రభాస్ వంటి హీరోలు జగన్ తో మాట్లాడటానికి వెళ్లినా ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉండగా వెళ్ళలేదు. అలా జగన్ ను కలిసినా అదో రాజకీయ రచ్చ అవుతుందని భావించి వద్దని వెళ్ళలేదు.

ఇక ఈ మధ్యనే అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడంతో మళ్ళీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ను లాగి మీడియా రచ్చ చేస్తోంది. అయితే ఇపుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. అదే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎన్టీఆర్ ల పాత ఫోటో. సినిమా షూటింగ్ స్పాట్ లో ముగ్గురు కూర్చుని ఉండగా ఎన్టీఆర్ నాని మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని ఉండగా నాని అదేమి పట్టించుకోకుండా ఏదో బుక్ చదువుతూ ఉండగా, వల్లభనేని వంశీ పక్కనే కూర్చొని నవ్వుతూ ఉన్న ఆ ఫోటో ఇపుడు మరోసారి వాళ్ళ సన్నిహిత్యాన్ని చర్చించేలా చేసింది. అమిత్ షా ఎపిసోడ్ లో కూడా కొడాలి నానితో వైసీపీ మాట్లాడించడం కొసమెరుపు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago