NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీ కాగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు.
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే ఇద్దరు పాత్రల నిడివి సమానంగా ఉండాలని ఇద్దరు పాత్రలకు ఒకే ప్రాధాన్యత ఉండాలని భావిస్తున్నారు. కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విషయంలో రామ్ చరణ్ పాత్రకు చాలా ప్రాధాన్యత కల్పించి ఎక్కువ నిడివి ఇచ్చారని, ఎన్టీఆర్ పాత్రను చాలా తక్కువ చేసి చూపించారు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రనిడివి తగ్గిన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా సినిమా రిసల్ట్ తేడా కొడుతుంది అంటూ నిర్మాతలకు తమ స్టైల్ లో వార్నింగ్ ఇస్తున్నారని చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ను సినిమాలో పెట్టుకొని ఆయనకు స్పెషల్ ఆపియరెన్స్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ పాత్రను హృతిక్ రోషన్ తో సమానంగా ఉంటేనే సినిమా రిజల్ట్ మరో లెవెల్ లో ఉండబోతుందని అలా కాకుండా ఎన్టీఆర్ పాత్రను తగ్గిస్తే సినిమాపై తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితులు తలుపుతాయని పలువురు భావిస్తున్నారు.అయితే ఇదే విషయాన్ని మేకర్స్ దృష్టిలో పెట్టుకొని హృతిక్ రోషన్ తో పాటు సమానంగా ఎన్టీఆర్ పాత్రను కూడా డిజైన్ చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…