NTR -Mokshagna:నందమూరి ఇంట పెళ్లి సందడి జరిగింది. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి వేడుకలో.ఒకే చోట సందడి చేయడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి దివంగత నటుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని గురించి అందరికీ సుపరిచితమే. అయితే సుహాసిని కుమారుడి వివాహం ఆదివారం గచ్చిబౌలిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
హరికృష్ణ మనవడు అంటే స్వయాన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లకు మేనల్లుడు కావడం విశేషం. ఈ విధంగా తన మేనల్లుడి పెళ్లి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ పెళ్లిలో అంతా తామై వ్యవహరించడంతో నందమూరి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే నందమూరి మోక్షజ్ఞ ఈ పెళ్లి వేడుకలలో సెంటర్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఇప్పటివరకు ఈయన ఎక్కడ కూడా అన్నయ్యలు అయినటువంటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసిన సందర్భాలు లేవు కానీ ఈ పెళ్లి వేడుకలలో మోక్షజ్ఞ స్వయంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నటువంటి ఫోటోలు అలాగే వీరితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ ముగ్గురు కూడా ఒకే ప్రేమ్ లోకనిపించడంతో వీరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.గత కొంతకాలంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇలా మోక్షజ్ఞ ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలు దిగడంతో ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రానున్న నేపథ్యంలో ఇలా తన అన్నయ్యలతో కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…