తెలుగు బుల్లితెర ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం మొదటి సీజన్ ఆదివారంతో ముగిసింది. ఇక చివరి ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా హాజరై ఎంతో సందడి చేశారు.ఒకే వేదికపై ఇలా ఇద్దరు స్టార్ హీరోలను చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ క్రమంలోనే తారక్ మహేష్ బాబుకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ తనని హాట్ సీట్లో కూర్చో పెట్టారో. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రశ్నలను వేయడంతో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా సమాధానాలను చెప్పారు. మహేష్ బాబు ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.
మధ్య మధ్యలో మహేష్ బాబు ఎన్టీఆర్ వారి వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ మీరు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అది ఎలా సాధ్యం అవుతుంది కరోనా సమయంలో కూడా వెకేషన్ కి వెళ్లారు అంటూ అడగడంతో అందుకు మహేష్ బాబు సమాధానం చెబుతూ కుటుంబంతో కలిసి స్పెండ్ చేయడం తనకు ఎంతో ఇష్టం అని ఏడాదిలో తన ఫ్యామిలీతో కలిసి మూడు సార్లు వెకేషన్ వెళ్తానని చెప్పారు.
ఇలా ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసినప్పుడు మా రిలేషన్స్ మధ్య మంచి బాండింగ్ ఉంటుందని మహేష్ చెప్పగా ఎన్టీఆర్ తన కూతురు సితార గురించి అడిగారు. సితార గురించి మహేష్ బాబు మాట్లాడుతూ తనతో గడిపిన ప్రతిక్షణం తనకు ఎంతో అద్భుతం అని సితార గురించి మాట్లాడుతుండగా అందుకు ఎన్టీఆర్ నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయ వేస్తుంది. ఎవరికైనా కూతుర్లు ఉన్న వాళ్ళని చూస్తే తనకు చాలా ఈర్ష కలుగుతుందని తనకు ఇద్దరు కొడుకులు కావడంతో కూతురు లేని వెళితి అలాగే ఉండిపోయిందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…