ఒక్కోసారి అదృష్టం ఎటువైపు నుంచి తలుపు తడుతుంతో తెలియదు. అప్పుడప్పుడు కొంతమందికి లాటరీ తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారనే వార్తలు వింటూ ఉంటాం. ఒకొక్కసారి ఎందుకు పనికిరాదు అనుకున్న వస్తువు కూడా లక్షల్లో వేలం వేయబడుతుంది. అలాంటిదే ఇక్కడ ఓ వ్యక్తి స్పూన్ ను ఓ దుకాణంలో 90 పైసలు పెట్టి కొన్నాడు.
అది ఏకంగా రూ.2 లక్షలకు అమ్ముడుపోయింది. ఏంటి.. నమ్మట్లేదా.. నిజమేనండి. అసలేమైందంటే.. లండన్ కు చెందిన ఓ వ్యక్తి వారాంతపు సంతలో భారత కరెన్సీ ప్రకారం ఓ స్పూన్ ను 90 పైసలకు కొన్నాడు. అది చూడటానికి వింతగా.. ఓ వైపు వంగి ఉంది. మన భాషలో చెప్పాలంటే డొక్కు స్పూన్ అంటాం. అయితే దానిని అతడు సోమర్‌సెట్‌లోని లారెన్సెస్ ఆక్షనీర్స్ సంస్థను సంప్రదించి ఆ చెంచాను ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు నమోదు చేసుకున్నాడు.
ఈ స్పూన్ ను ఆ సంస్థకు చెందిన సిల్వర్ ఎక్స్‌పర్ట్ అలెక్స్ బచర్ పరిశీలించాడు. అతడి పరిశీలనలో ఇది 13వ శతాబ్దం నాటి అరుదైన వస్తువుగా గుర్తించారు. మధ్య యుగం కాలం నాటి స్పూన్ గా గుర్తించడంతో ఆ స్పూన్ ఖరీదు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కంపెనీ దాన్ని చరిత్రను మొత్తం బ్లాగ్ లో రాసి ఆన్‌లైన్లో రూ.51,712 కు అమ్మకానికి పెట్టింది. దీనిని కొనేందుకు చాలామంది పోటీ పడ్డారు.
అయితే ఈ స్పూన్ చాలా అరుదైనది ని తెలియడంతో రోజు రోజుకీ దీని ఖరీదు పెరుగుతూ.. బిడ్డింగ్ పెరుగుతూ వచ్చింది. వెండితో చేసిన ఈ స్పూన్ ను రూ.1,97,000 కు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ట్యాక్స్ తో సహా అన్ని కలుపుకుంటే.. ఈ స్పూన్ రెండు లక్షలు పైగా ధరపలికింది. దీంతో ఆ స్పూన్ అమ్మకానికి పెట్టిన అతడే షాక్ అయ్యాడు. ఆ స్పూన్ ని 90 పైసలకు కొనుగోలు చేసిన వ్యక్తి ఇంత ధరకు పోతుందని కలలో కూడా అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…