Categories: FeaturedMovie News

కార్తీకదీపం : కీలక మలుపు తిరిగిన మోనిత కేసు..! కార్తీక్ కు చుక్కలు చూపించిన ఏసీపీ..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అంజి దొరికాడని దీప అబద్ధం చెప్పడంతో మోనిత పార్టీ చేసుకుంటుంది.ఈ క్రమంలోనే అక్కడకు దీపా కార్తీక్ వెళ్లి మౌనిత కు షాక్ ఇస్తారు. ఇక నేడు కార్తీకదీపం సీరియల్ 1107 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేడు ఈ సీరియల్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం.. ఈ కేసు విషయమై డాక్టర్ బాబు ఏసిపి రోషిని ఇంటికి వెళ్తాడు. డాక్టర్ బాబుని చూసిన రోషిని రండి అంటూ అతనిని ఆహ్వానించింది. కార్తీక్ ని ఏంటి మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లేలా ఉన్నారు. సరెండర్ అవ్వడానికి వచ్చారా? అంటూ ప్రశ్నిస్తుంది. ఏసీపీ ఇలా అనడంతో నేను తప్పు చేస్తే కదా.. సరెండర్ అవ్వడానికి అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు. ఈ క్రమంలోనే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీరే కదా అంటూ తనదైన శైలిలో ప్రశ్నిస్తుంది.

ఈ క్రమంలోనే డాక్టర్ బాబు మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు తన పైశాచికత్వం రోజు రోజుకు పెరిగిపోతుంది. అని చెప్పడంతో తనకు జరిగిన అన్యాయానికి న్యాయపోరాటం చేస్తోంది అని ఏసీపీ చెబుతుంది. అసలు తనకు అన్యాయం జరిగితే కదా అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు. ఈ విధంగా ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేస్తూ రోషిని ఏ సంబంధం లేకపోతే ఇన్ని రోజులు తనని ఎందుకు భరించారు? తన ఇంటికి ఎందుకు వెళ్లారు? తను పిలవగానే కారు ఎక్కి వెళ్తావు… తను చెయ్యి కోసుకుంటే పరిగెత్తి వస్తావు. తను గుండెనొప్పి తెప్పించిన క్షమించారు.. దీనికి ఏ పేరు పెట్టాలి? సంస్కార మా? అపరాధ భావమా అంటూ ప్రశ్నలు వేస్తోంది.

మీరు స్నేహం పేరుతో గంటలు గంటలు మోనిత ఇంట్లో కూర్చొని మందు తాగుతూ ఉంటారు. తనకు మీ పై ప్రేమ ఉందనీ తెలిసిన కూడా అక్కడికి వెళ్తుంటారు. అయినా మిమ్మల్ని మోనిత ఇంట్లోకి ఎలా రాణించింది..ఆడ, మగ స్నేహానికి చిన్న గీత ఉంటుంది. ఆ రేఖకు మీరు ఎటువైపు ఉన్నారా? అది చూసే వాళ్లకు తెలియదు కానీ మీరు ఆ రేఖలు దాటారు అంటూ అనడంతో కార్తీక్
స్టాపిట్ అని గట్టిగా అరిచి ఆ తరువాత తను ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నాను అని గ్రహించి క్షమాపణ చెబుతాడు. మోనిత మీపై పెట్టిన కేసుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది సాక్షాలు మీ వద్ద ఉన్నాయి. మగవాడి శీల పరీక్షకు మించిన అగ్నిపరీక్ష మరొకటి లేదంటూ రోషిని మాట్లాడుతుంది. అందుకు కార్తీక్ మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నావల్ల దీపకు అన్యాయం జరగకూడదని చెబుతాడు.

మోనిత కేసు గురించి అనేక రకాలుగా ఆలోచిస్తున్నాను. అంజి పేరు ఎత్తితే ఆమె కంగారు పడుతుంది. అంజి కోసమే మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు.అంజి ఎక్కడున్నాడు చెప్పండి నేను వెళ్ళి తీసుకు వస్తాను అని కార్తిక్ అనడంతో ఈ కేసు మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనిలేదని అని చెబుతుంది. మిమ్మల్ని అరెస్టు చేస్తే దీప పిల్లలు, మౌనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్యాయం అయిపోతారు. మోనితకు న్యాయం చేస్తే దీపకు అన్యాయం చేసిన దాన్ని అవుతావు. అందుకోసమే మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆగాను. ఈ కేసును ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు మీరు ప్రశాంతంగా ఉండండి. తప్పకుండా దోషి ఎవరు నిర్దోషి ఎవరో కాలమే బయటపెడుతుంది అంటూ రోషిని తెలిపారు. మరి ఆ తర్వాత కథ ఎలా సాగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago