Once again, Bigg Boss Adireddy's father.. video going viral!
బిగ్ బాస్ సీజన్ 6లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి, తన విశ్లేషణలతో ఫైనల్ వరకు చేరుకున్న ఆదిరెడ్డి జీవితంలో మరో సంతోషకరమైన ఘట్టాన్ని అందుకున్నాడు. ఆయనకు రెండవసారి పండంటి పాపాయి జన్మించింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు.
గతంలో భార్య కవితకు నిర్వహించిన సీమంతం ఫోటోలు, వీడియోలను పంచుకున్న ఆదిరెడ్డి, తాజాగా తన భార్య రెండవ పాపాయికి జన్మనిచ్చిందని ప్రకటించారు. డాక్టర్ చేతుల మీదుగా పాపాయిని తీసుకుంటున్న వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆదిరెడ్డికి ఒక పాప ఉండగా, ఇప్పుడు రెండోసారి కూడా పాప పుట్టడంతో, “మహాలక్ష్మి మళ్లీ మా ఇంట్లోకి వచ్చింది” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మరియు నెటిజన్లు ఆదిరెడ్డికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలు, యూట్యూబ్ ఛానెల్, మరియు ఇతర వ్యాపారాలతో కెరీర్‌లో స్థిరపడిన ఆదిరెడ్డి, ఇప్పుడు కుటుంబంలో కొత్త సభ్యురాలి రాకతో మరింత ఆనందంగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…