రేపు అనగా ఆగస్టు 15. బారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 ఏళ్లు. అంటే 74 ఏళ్లు పూర్తి చేసుకొని 75లోకి అడుగుపెడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు దేశభక్తిలోకి వెళ్లిపోయారు. 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రిలీజ్ అయిన పోస్టేజ్ స్టాంపును ఇప్పుడు షేర్ చేసుకుంటూ… దేశభక్తిని చాటుకుంటున్నారు.
దీంతో ఆ పోస్టల్ స్టాంప్ వైరల్ గా మారింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్… అప్పటి స్టాంపును ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ఈ స్టాంపును రిలీజ్ చేశారని తెలిపారు. ఈ పోస్టల్ స్టాంప్ కాస్త ఆసక్తి కరంగా ఉంది. మువ్వన్నెల జెండా దీనిలో రెపరెపలాడుతూ కనిపించింది. అందులో ఉన్న బొమ్మ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మెట్లు ఎక్కి పైకి వచ్చి… జెండా ఆవిష్కరించినట్లుగా ఆ బొమ్మ ఉంది. దానిపై 15 ఆగస్ట్ 1947 అని కూడా రాశారు. జైహింద్ అని దేశ ఐక్యతను చాటేలా హిందీ అక్షరాలతో రాశారు.
స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్యాంపెయిన్ మార్చి 12న ప్రారంభమైంది. ఇది వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నాటికి ముగుస్తుంది. ఈ స్టాంప్ ను 1947 నవంబర్ 21న విడుదల చేశారు.ఈ స్టాంపును అప్పట్లో దాని విలువ మూడున్నర అణాలుగా ఉండేది. వేరే దేశస్థుల కోసం దీనిని తయారు చేశారు. 1947 డిసెంబర్ 15న రెండో స్టాంపును దేశీయ అసరాల కోసం విడుదల చేశారు. దానిని అశోక లయన్ క్యాపిటల్ అని పిలిచారు.
దాని విలువ ఒకటిన్నర అణా. వీటిలాగానే మరో స్టాంపును 1947 డిసెంబర్ 15నే రిలీజ్ చేశారు. దానిపై ఎగిరే విమానం ఉంది. రెండు స్టాంపులను చూపిస్తూ కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ ట్వీట్ చేశారు. వీటిని మహాత్మాగాంధీ 1930 దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహాన్ని స్మరిస్తూ… 1980లో వాటిని రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఇలా పలు రకాల స్టాంపులను మంత్రి ట్విట్టర్ ద్వారా చూపించారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…