రెండు రోజుల క్రితం పెళ్లి కూతురు బరాత్ లో బుల్లెట్ బండెక్కి వచ్చేస్తవా.. అంటూ పాటకు డ్యాన్స్ వేసి.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆమె డాన్స్‌కు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ చానల్స్ ఫిదా అయ్యాయి. ఏ చానల్ చూసినా మొన్నటి వరకు ఆమె డ్యాన్స్ కనిపించింది. అచ్చం సింగర్ మోహన భోగరాజు వేసిన స్టెప్పులను వేస్తూ చాలామంది మహిళలు అలరిస్తున్నారు.
అయితే తాజాగా ఈ పాటకు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా ఓ నర్సు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ డ్యాన్స్ సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి పీహెచ్‌కి చెందిన నర్సు డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. పీహెచ్ సీ లో డ్యాన్స్ వేయడంపై ఆమెపై పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాని స్వాతంత్య్రదినోత్సవ సంబరాల్లో భాగంగా ఆసుపత్రి కారిడార్‌లో అందరూ కూర్చుని డాన్స్ చేయడం తప్పు కాదనే వాదనను వారు తీసుకువస్తున్నారు. ఒకవేళ డ్యాన్స్ వేయాలంటే.. ఆసుపత్రి బయట వేయాలి కానీ.. ఇలా ఆసుపత్రిలో వేయడంపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించినట్టు సమాచారం.
విధులు వదిలిపెట్టి డాన్స్ చేస్తే తప్పు కాని స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా డాన్స్ చేయడం పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు అంటున్నారు. అంతే కాకుండా నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కోవిడ్ ఆసుపత్రిల్లో రోగుల మనో ధైర్యం కోసం అనేక చోట్ల నర్సులు పాటలు, డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా అప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతుందని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దీనిని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ పాట రాయగా.. సింగర్ మోహన భోగరాజు పాడటంతో పాటు డ్యాన్స్ వేసి ఆల్బమ్ ను కూడా రిలీజ్ చేశారు. మొదట్లో అంతగా ప్రాచూర్యం పొందనప్పటికీ.. మొన్న పెళ్లి కూతురు సాయి శ్రీ తన పెళ్లిలో భర్త ముందు చేయడం ఈ పాట నేపథ్యానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…