కొంతమంది చిన్న తనం నుంచే సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్లను ఏ చిన్న మాట అన్నా బాధపడుతుంటారు. సరదాగా ఏదైనా విషయం వాళ్ల గురించి మాట్లాడితే అలుగుతుంటారు. వీళ్లతో పాటు కొంతమంది పరీక్షల్లో పాసవ్వలేదనో, తల్లిదండ్రులు తిట్టారనో, ఫోన్ ఇవ్వలేదని, టీవీ చూడలేదని.. ఆటలు ఆడుకోనివ్వడం లేదని.. ఇలా పలు కారణాల వల్ల చిన్నారులు క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో ఎన్నో ఆశలతో కని పెద్ద చేసిన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నారు. అయితే ఇలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తసుకుంటున్న వారి సంఖ్య మూడేళ్ల వ్యవధిలో అంటే 2017 నుంచి 2019 మధ్య కాలంలో 14 నుంచి 18 ఏళ్ల 24 వేల టీనేజర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు NCRB(National Crime Records Bureau) వెల్లడించింది.
NCRB తాజాగా పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంతోనే దాదాపు 4,046 మంది ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. 24 వేల మంది ఆత్మహత్య చేసుకున్న వారిలో 2017లోనే 8,029 మంది, 2018లో 8162 మంది, 2019 సంవత్సరంలో 8,377 మంది ప్రాణాలు తీసుకున్నారని పార్లమెంట్ కు నివేదించిన దానిలో వెల్లడించారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్, తర్వాత పశ్చిమబెంగాల్‌లో, మహారాష్ట్ర లో ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
పరీక్షల్లో తప్పడం, ప్రేమ వ్యవహారాల వల్లనే ఎక్కువగా మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు. చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై తల్లీదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే అవగాహన కల్పించాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కరోనా పరిస్థితుల కారణంగా 2020 నుంచి 2021 మధ్య కాలంలో కూడా ఇలాంటి మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వెల్లడించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…