Featured

RRR లేటెస్ట్ సాంగ్ ‘దోస్తీ’పై నెగిటివ్ కామెంట్స్.. తమన్ ని కాపీ కొట్టారా?

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమైన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన గత పాన్ ఇండియన్ సిరీస్ బాహుబలి వరకు అపజయం అంటే ఏంటో తెలియని దర్శకుడు. ఒక్కో సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంటూ బాహుబలి రెండు భాగాలతో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ దర్శకుడుగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి గురువుకు తగ్గ శిష్యుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు.

ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కాస్త ఎక్కువ పేరునే సాధించారు. హీరో ఎవరైనా సినిమా మీద రాజమౌళి ముద్ర పడాల్సిందే. ఒక సీన్ కోసం రోజులకి రోజులు చిత్రీకరణ జరుపుతాడనే విషయంలో కొంత నెగిటివ్ కామెంట్స్ వినిపించిన ఫైనల్ గా అవుట్ పుట్ చూసిన వారు నోటికి తాళాలు వేసుకోవాల్సిందే. జూనియర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్, సునీల్, రవితేజ, రానాలకు తన సినిమాలతో దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ భారీ స్థాయిలో క్రేజ్ తీసుకువచ్చాడు.

ఇక రాజమౌళి సినిమాల విషయంలో కథ ఏంటో ముందే చెప్పేయడం అలవాటు. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కథ ఏంటి అనేది చెప్పరు. కానీ రాజమౌళి కథ ముందే లీక్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేస్తాడు. సినిమా చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు వినూత్నంగా ప్రమోషన్ నిర్వహిస్తూ భారీ స్థాయిలో అంచనాలు కలిగేలా చేస్తాడు. ముఖ్యంగా బాహుబలి సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా రాజమౌళి చేసినట్టు సినిమా ప్రమోషన్స్ ఇంకెవరూ చేయలేరని చెప్పుకున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా తెరకెక్కుతున్న ఫిక్షనల్ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. గోండు బెబ్బులి కొమురం భీంగా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారమరాజుగా చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ పోస్టర్ గురించి గానీ, టీజర్ గురించి గానీ నెగిటివ్ టాక్ వినిపించలేదు. సినిమా మీద అంచనాలు భారీగానూ పెంచాయి.

కానీ తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి దోస్తీ అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఐడియా తన కొడుకు ఎస్‌.ఎస్‌.కార్తికేయట. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను పాడిన అమిత్‌ త్రివేది, అనిరుద్‌, విజయ్‌ యేసుదాసు, తెలుగులో హేమచంద్ర, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కనిపించారు. చివర్లో తారక్, చరణ్ మెరిశారు. విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. థమన్ ని కాపీ కొట్టారన్న టాక్ తో  పాటు.. ఇక్కడ సినిమా ప్రమోషన్ కంటే వారి వారిని హైలెట్ చేసుకునేట్టుగా ఉందని.. మాట్లాడుకుంటున్నారు. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తుందంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago