Categories: FeaturedMovie News

కోట్లు వస్తాయని నేను వాళ్ళను మోసం చేయలేను : సాయి పల్లవి

సినిమా హీరో, హీరోయిన్స్ అంటే దేశ వ్యాప్తంగా ఉండే పాపులారిటీ క్రేజ్, సెలబ్రిటీ హోదానే వేరు. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాక ఓ భారీ హిట్ దక్కితే అందరికీ వాళ్ళతోనే సెల్ఫీ దిగాలని మొదలయ్యే కోరిక నుంచే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవాలనే రేంజ్ వరకు క్రేజ్ సంపాదించుకుంటారు. ఇదే క్రేజ్‌తో సెలబ్రిటీస్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని ఆపాదించుకొని వచ్చిన క్రేజీ ఆఫర్ ఏదైనా వదలకుండా కోట్లు కూడబెట్టుకునేందుకు తయారవుతారు. యాడ్ ఫిలింస్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటి వాటితో పాటు విదేశాలలో ఈవెంట్స్‌కి హాజరవుతూ బాగా సంపాదించేస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి సినిమా కంటే కూడా కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లోనే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారు.

కానీ అలాంటి కోట్లు తెచ్చిపెట్టే కమర్షియల్ యాడ్స్ చేయడం మాత్రం ఓ స్టార్ హీరోయిన్ ఇష్టముండదని అంటోంది. ఆమె  ఫిదా బ్యూటి సాయి పల్లవి. నేచురల్ పర్ఫారమర్‌గా సాయి పల్లవికి సౌత్ మొత్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ తన కోసం దాదాపు 8 నెలలు వెయిట్ చేశాడంటే తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఢీ లాంటి డ్యాన్సు షోస్ లో పాల్గొన్న సాయి బాగా పాపులర్ అయింది. కానీ ఆమె తండ్రి ముందు చదువు ఆ తర్వాతే ఇంకేదైనా అని చెప్పి కోరడంతో జార్జియాలో మెడిసిన్ చదవదానికి వెళ్ళింది. నాలుగు సంవత్సరాలు మెడిసిన్ పూర్తి చేసిన సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అల్ఫోన్సో రూపొందించిన ప్రేమమ్ చిత్రంలో నటించే అవకాశం అందుకుంది.  

ఆ రకంగా సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటరయింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో భానుమతి పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సొంతగా తన గొంతు వినిపించాలని ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఫిదా తర్వాత నేచురల్ స్టార్ నానితో ఎం.సి.ఏ, శర్వానంద్ తో పడి పడి లేచే మనసు, తమిళంలో ధనుష్ తో  మారి 2 సినిమాలలో నటించింది.

ఈ సినిమాలతో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీస్‌లో క్రేజీ హీరోయిన్ గా మారింది. దాంతో సాయి పల్లకి కొన్ని కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేయమని ఆఫర్స్ వచ్చాయట. వాటిలో కొన్ని బ్యూటీకి సంబంధించిన యాడ్స్ కూడా ఉన్నాయట. సినిమాలలో కంటే నాలుగింతలు రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. కానీ ఓ ప్రాడెక్ట్‌ని ప్రమోట్ చేయడం.. దాంతో జనాలని మోసం చేయడం ఇష్టం లేకనే భారీ రెమ్యునరేషన్ వస్తున్నా కమర్షియల్ యాడ్స్ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకోలేదు. ఇప్పటికే అలా వచ్చిన చాలా ఇంటర్‌నేషనల్ యాడ్స్ వదిలేసింది. ఫ్యూచర్‌లో కూడా ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా ఈ యాడ్స్ చేయనని కూడా ఈమె తెగేసి చెప్పింది.

ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో నటించింది. ఇటీవలే ఈ సినిమా కంప్లీట్ చేసింది. అలాగే తన ఫేవరేట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి సినిమా చేసింది. ఇందులో అక్కినేని నాగ చైతన్యకి జంటగా నటించింది. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. అలాగే రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాను పూర్తి చేసింది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి మరో హీరోయిన్‌గా నటించింది. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే సాయి పల్లవి రేంజ్ మరింతగా పెరుగుతుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago