సినిమా హీరో, హీరోయిన్స్ అంటే దేశ వ్యాప్తంగా ఉండే పాపులారిటీ క్రేజ్, సెలబ్రిటీ హోదానే వేరు. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాక ఓ భారీ హిట్ దక్కితే అందరికీ వాళ్ళతోనే సెల్ఫీ దిగాలని మొదలయ్యే కోరిక నుంచే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవాలనే రేంజ్ వరకు క్రేజ్ సంపాదించుకుంటారు. ఇదే క్రేజ్‌తో సెలబ్రిటీస్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని ఆపాదించుకొని వచ్చిన క్రేజీ ఆఫర్ ఏదైనా వదలకుండా కోట్లు కూడబెట్టుకునేందుకు తయారవుతారు. యాడ్ ఫిలింస్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటి వాటితో పాటు విదేశాలలో ఈవెంట్స్‌కి హాజరవుతూ బాగా సంపాదించేస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి సినిమా కంటే కూడా కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లోనే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారు.

కానీ అలాంటి కోట్లు తెచ్చిపెట్టే కమర్షియల్ యాడ్స్ చేయడం మాత్రం ఓ స్టార్ హీరోయిన్ ఇష్టముండదని అంటోంది. ఆమె ఫిదా బ్యూటి సాయి పల్లవి. నేచురల్ పర్ఫారమర్‌గా సాయి పల్లవికి సౌత్ మొత్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ తన కోసం దాదాపు 8 నెలలు వెయిట్ చేశాడంటే తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఢీ లాంటి డ్యాన్సు షోస్ లో పాల్గొన్న సాయి బాగా పాపులర్ అయింది. కానీ ఆమె తండ్రి ముందు చదువు ఆ తర్వాతే ఇంకేదైనా అని చెప్పి కోరడంతో జార్జియాలో మెడిసిన్ చదవదానికి వెళ్ళింది. నాలుగు సంవత్సరాలు మెడిసిన్ పూర్తి చేసిన సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అల్ఫోన్సో రూపొందించిన ప్రేమమ్ చిత్రంలో నటించే అవకాశం అందుకుంది.

ఆ రకంగా సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటరయింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో భానుమతి పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సొంతగా తన గొంతు వినిపించాలని ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఫిదా తర్వాత నేచురల్ స్టార్ నానితో ఎం.సి.ఏ, శర్వానంద్ తో పడి పడి లేచే మనసు, తమిళంలో ధనుష్ తో మారి 2 సినిమాలలో నటించింది.

ఈ సినిమాలతో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీస్‌లో క్రేజీ హీరోయిన్ గా మారింది. దాంతో సాయి పల్లకి కొన్ని కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేయమని ఆఫర్స్ వచ్చాయట. వాటిలో కొన్ని బ్యూటీకి సంబంధించిన యాడ్స్ కూడా ఉన్నాయట. సినిమాలలో కంటే నాలుగింతలు రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. కానీ ఓ ప్రాడెక్ట్‌ని ప్రమోట్ చేయడం.. దాంతో జనాలని మోసం చేయడం ఇష్టం లేకనే భారీ రెమ్యునరేషన్ వస్తున్నా కమర్షియల్ యాడ్స్ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకోలేదు. ఇప్పటికే అలా వచ్చిన చాలా ఇంటర్‌నేషనల్ యాడ్స్ వదిలేసింది. ఫ్యూచర్‌లో కూడా ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా ఈ యాడ్స్ చేయనని కూడా ఈమె తెగేసి చెప్పింది.

ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో నటించింది. ఇటీవలే ఈ సినిమా కంప్లీట్ చేసింది. అలాగే తన ఫేవరేట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి సినిమా చేసింది. ఇందులో అక్కినేని నాగ చైతన్యకి జంటగా నటించింది. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. అలాగే రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాను పూర్తి చేసింది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి మరో హీరోయిన్‌గా నటించింది. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే సాయి పల్లవి రేంజ్ మరింతగా పెరుగుతుంది.

































