Featured

మోదీ కొత్త చట్టం.. పాత కార్లు, బైక్ లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పాత బైక్ లు, పాత కార్లు ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. పాత వాహనాలు ఉన్నవాళ్లకు షాక్ ఇచ్చేలా కొత్త చట్టం అమలులోకి తీసుకురావనుంది. ఫలితంగా పాత వాహనాలు ఇంటికే పరిమితం కావడం లేదా ఇనుప సామానుకు వేయడం మినహా మరో ఆప్షన్ లేదు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పాత వాహనాలు కలిగి ఉన్నవాళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త చట్టం ద్వారా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను ఇకపై వాడేందుకు వీలు ఉండదు. కొత్త వాహనాల డిమాండ్ ను పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.

ఈ చట్టం వల్ల వాహనాల కాలుష్యం కూడా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో నితిన్ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీఎంవో ఈ పాలసీ గురించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటికీ చాలామంది చాలామంది వ్యక్తిగత అవసరాల నిమిత్తం పాత వాహనాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.

కొత్త పాలసీ అమలు ద్వారా మన దేశం ఆటోమొబైల్ హబ్‌ గా మారుతుందని నితిన్ గడ్కరీ అభిపాయపడుతున్నారు. కొత్త వాహనాలలో స్క్రాపేజ్ వాహనాల భాగాలను కేంద్రం వినియోగించవచ్చని చెబుతుండటంతో వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

38 seconds ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

10 minutes ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

13 minutes ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

18 minutes ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

27 minutes ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

3 hours ago