కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పాత బైక్ లు, పాత కార్లు ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. పాత వాహనాలు ఉన్నవాళ్లకు షాక్ ఇచ్చేలా కొత్త చట్టం అమలులోకి తీసుకురావనుంది. ఫలితంగా పాత వాహనాలు ఇంటికే పరిమితం కావడం లేదా ఇనుప సామానుకు వేయడం మినహా మరో ఆప్షన్ లేదు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పాత వాహనాలు కలిగి ఉన్నవాళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త చట్టం ద్వారా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను ఇకపై వాడేందుకు వీలు ఉండదు. కొత్త వాహనాల డిమాండ్ ను పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.
ఈ చట్టం వల్ల వాహనాల కాలుష్యం కూడా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో నితిన్ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీఎంవో ఈ పాలసీ గురించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటికీ చాలామంది చాలామంది వ్యక్తిగత అవసరాల నిమిత్తం పాత వాహనాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
కొత్త పాలసీ అమలు ద్వారా మన దేశం ఆటోమొబైల్ హబ్ గా మారుతుందని నితిన్ గడ్కరీ అభిపాయపడుతున్నారు. కొత్త వాహనాలలో స్క్రాపేజ్ వాహనాల భాగాలను కేంద్రం వినియోగించవచ్చని చెబుతుండటంతో వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.



























