Featured

Pachalla Prakash : గబ్బర్ సింగ్ సినిమాకి ఫుడ్డు బిల్లు కోటిన్నర వస్తే… పవన్ కళ్యాణ్ గారు క్యారవాన్ లోకి పిలిచి ఏమన్నారంటే…: పచ్చళ్ళ ప్రకాష్

Pachalla Prakash : సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా నలభై ఏళ్లుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఎన్టీఆర్ దగ్గరి నుండి నేటి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పనిచేసిన పచ్చళ్ళ ప్రకాష్ గారు ‘గబ్బర్ సింగ్’ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన అనుభవం అలాగే ఆయన అందరినీ చూసే విధానం గురించి చెబుతూ తన సినిమా అనుభవాలను పంచుకున్నారు. అలాగే గబ్బర్ సింగ్ కేటరింగ్ పెట్టడానికి కారణాలను తెలిపారు.

గబ్బర్ సింగ్ క్యాటరింగ్ అందుకే పెట్టా…

పచ్చళ్ళ ప్రసాద్ గారు ‘నా దేశం’ సినిమా సమయంలో ఎన్టీఆర్ గారితో పనిచేసారు. ఆయనకు భోజనం వడ్డించడం చేసేవాడు. ఆయన సీఎం అయ్యాక కూడా ఆయనకు భోజనం వడ్డించేవాడిని అంటూ తెలిపిన ఆయన పవన్ కళ్యాణ్ గారితో అనుబంధం గురించి వివరించారు. పవన్ కళ్యాణ్ గారి తీన్మార్ సినిమా సమయంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు పనిచేయాలి రా అని పిలిస్తే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాజమౌళి తో చేస్తున్న సినిమా పనులు బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేదు. ఆ సినిమా తరువాత మళ్ళీ బండ్ల గణేష్ నుండి పిలుపు వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమాకు చేయాలని వెంటనే ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పాడు అంటూ చెప్పారు పచ్చల్ల ప్రసాద్.

ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ మేనేజర్ గా దాదాపు 2000 మంది పనిచేయగా అందరికీ వసతులు కల్పిస్తూ భోజనం అన్నీ చూసుకున్నాం అంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఫుడ్డు తింటారో అదే అక్కడున్న అందరికీ పెట్టాలన్నది ఆయన ఉద్దేశం అందుకే అలాంటి ఆహారం అలాగే జ్యూస్ లు అందరికీ ఇచ్చేవాళ్ళం. సినిమా షూటింగ్ పూర్తయ్యాక పవన్ గారు కారవాన్ లోకి పిలిచి బాగా చేసారు ప్రతి రోజు గమనించాను అంటూ చెప్పారు. ఆ సినిమా షూటింగ్ అపుడు దాదాపు కోటిన్నర బిల్ అయింది అందులో లాభం చూసుకోకుండా పెట్టాం అందరికీ అంటూ చెప్పారు. ఇక సినిమా హిట్ అయ్యాక పవన్ పిలిచి 25 లక్షలు ఇస్తాను ఏదైనా అడుగు అన్నారు అపుడు ఒకరోజు అలోచించి గబ్బర్ సింగ్ కేటరింగ్ కోసం ఆ డబ్బు తీసుకున్నాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago