పెళ్లి సమయంలో వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని కోరుకుంటారు. ఇందుకు వినూత్న అలంకరణ పద్ధతులను ఎంచుకుంటారు. అయితే పెళ్లి కోసం ఏకంగా 100 కేజీల బరువైన లెహంగా కుట్టించుకుంది ఓ పాకిస్తానీ పెళ్లి కూతురు. వెడ్డింగ్ కి వచ్చిన గెస్టులు, ఇతరులు అంతా చూసి ఆశ్చర్యపోయారు. కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూశారట.
అతిపెద్ద లెహంగా ధరించి వధువు నడుస్తుంటే.. అతిథులు ఊపిరిబిగబట్టి మరీ చూశారు. ఇక లెహంగా తయారీకి ఎంత ఖర్చయిందో తెలియరాలేదు. పెళ్లి కూతురు భారీ లెహంగాతో అతిథుల దృష్టిని ఆకర్షించిప్పటికీ.. వరుడు మాత్రం గోల్డెన్ షేర్వాణీ, మెరూన్ కలర్ తలపాగా ధరించి చాలా సింపుల్ గా కనిపించాడు. పెళ్లి స్టేజ్ అంతా వధువు లెహంగానే ఆక్రమించింది.
దీంతో వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపు.. అక్కడి ఆడవారు లెహంగా గురించే మాట్లాడుకున్నారు. కొందరు తమ ఫోన్ కెమెరాలతో ఈ అద్భుతమైన దృశ్యాన్ని రికార్డ్ చేశారు. అంతే కాకుండా వాటిని ఇంటర్నెట్ లో కూడా షేర్ చేశారు. దీంతో ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అబ్బో, ఈ వధువు వ్యవహారం మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
దాన్ని ధరించడానికి ఆమెకు ఎన్ని గంటలు పట్టిందో అని మరొకరు.. పాకిస్థాన్ లో ఇంత బడాబాబులు ఉన్నారా అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక నేలను ఊడ్చే పని సీపర్లకు ఉండదేమో అని సెటైర్ వేశారు. అయితే ఈ వీడియో గత ఏడాదిలోనే నెట్టింట ప్రత్యక్షం కాగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా, అంత బరువైన లెహంగా ధరించిన వధువు ధైర్యానికి అందరూ మెచ్చుకోవాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…