Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ ఆరోగ్యం రోజురోజుకీ క్షమించిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు రోజా గారు నాగబాబు గారు తనకు ఆర్థికంగా చాలా సహాయం చేశారని తెలియజేశారు.
నూకరాజు తనకు తమ్ముడి కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు. ఇక కిరాక్ ఆర్ పి లక్ష రూపాయల వరకు సహాయం అందించారని తెలిపారు.ఇక నేను ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే తనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని ప్రసాద్ తెలిపారు. అయితే తన పిల్లల గురించి ఆలోచించి సర్జరీ కాస్త ఆలస్యం చేశానని ఈయన వెల్లడించారు. తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
తన భార్య తన పిల్లల కన్నా నన్నే చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారని ఆమె లేకపోతే నేను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని అంటూ ఈయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నా పిల్లల గురించి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగవని ఒకప్పుడు నా గురించి చాలామంది ఆలోచించి తనకు సహాయం చేస్తామని చెప్పినా నేను వద్దని చెప్పానని ప్రసాద్ తెలిపారు. అయితే డాక్టర్లు మాత్రం టాబ్లెట్స్ వాడటం కన్నా సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని చెప్పారు. కానీ ఈ సర్జరీ కొందరికి సక్సెస్ అవుతుంది మరికొందరికి సక్సెస్ కాదు అన్న భయంలో తాను ఉన్నానని తెలిపారు.ఇలా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…