సాధారణంగా మన ఇండియాలో రోడ్డుపక్కన దొరికే పానీపూరి అంటే అమ్మాయిలు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.అయితే పానీపూరి అంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ వాటిని ఎక్కువగా తినడం, తరచూ తినడం చూస్తుంటాం కానీ ఏకంగా పానీ పూరిలతో నగలను తయారు చేయించుకుని వేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న యువతి మాత్రం తనకు పానీపూరీలు అంటే ఎంతో ఇష్టమని ఏకంగా తన పెళ్లిలో పానిపూరి నగలను ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయిల హడావిడి అంతా ఇంతా కాదు.చీరలు డిజైనర్ బ్లౌజులు వాటికి సెట్ అయ్యే నగలను ఎంపిక చేసుకుంటూ ఎంతో హంగామా చేస్తారు. కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం మరొక అడుగు ముందుకు వేసి తనకు ఎంతో ఇష్టమైన పాని పూరీలతో నగలు చేసుకుని పెళ్లిలో సాధారణ నగలతో పాటు వాటిని ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ విధంగా వెరైటీ పానీపూరి నగలతో ఉన్న వధువును సరదాగా బంధువులు ఆటపట్టించగా ఆమె ఎంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతోంది. ఈ విధంగా వధువు పానిపూరి నగలను ధరించినటువంటి వీడియోను ఒక బ్రైడల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
https://www.instagram.com/reel/CQGWMz1pGVR/?utm_source=ig_web_copy_link
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు పానీ పూరిల పై ప్రేమ అంటూ ఆశ్చర్యపోగా… మరికొందరు తాము కూడా ఈ స్టైల్ ఫాలో అవుతాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్‌ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన…