సాధారణంగా మనం జూలో సింహాన్ని చూస్తేనే ఎంతో భయపడుతుంటాము. ఎంతో పెద్దదైన శరీర ఆకారం, సింహం గాండ్రింపు, ఒక్కసారిగా సింహం జూలు విదిల్చింది అంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాలంటే చాలామంది భయపడతారు.అయితే ఇలాంటి సింహాలు కొన్నిసార్లు ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి జనావాసాలలో తిరగడం మనం చూస్తుంటాము. అయితే ఒక సింహం వస్తేనే వెన్నులో వణుకు పుట్టి భయంతో పరుగులు పెడతాము. అలాంటిది ఏకంగా సింహాలు గుంపులుగా వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి..
తాజాగా గుజరాత్ లో ఈ విధంగా కొన్ని సింహాలు కలిసి గుంపుగా కలిసి అడవికి దగ్గరగా ఉన్న పిపావవ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. ఓడరేవులోకి ప్రవేశించిన సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ, పోర్టు మొత్తం అటు ఇటు షికార్లు కొట్టాయి.అయితే ఈ విధంగా ఒక్కసారిగా పోర్టులోకి సింహాలు గుంపులు రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీటిని చూసి ఎంతో భయాందోళన చెందారు.
ఈ క్రమంలోనే పోర్టు సిబ్బంది ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే అటవీ అధికారులు అప్రమత్తమై సింహాలను అడవిలో కి తరలించారు. ప్రస్తుతం ఈ విధంగా సింహాలు రేవులోకి వచ్చిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నగర పర్యటనకు వచ్చిన సింగం అంటూ కామెంట్లు చేయగా.. మరి కొందరు ఎంతో భయం వేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరెందుకాలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…