బుల్లితెర సీరియల్ నటి చైత్ర రాయ్ తాజాగా ‘తానూ తల్లి కాబోతున్నాను’ అంటూ తన అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె “ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి. కెరీర్, పని, ఇంట్లో వంటపని వంటివి చేసుకునేందుకు మున్ముందు చాలా సమయం ఉంది. కుటుంబం ముఖ్యమైనదే కాదు కుటుంబమే సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట్లో అడుగుపెడుతుంది. ఈ విషయాన్ని అభిమానులైన మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ సరికొత్త ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలతో పాటూ ఆశీస్సులు కూడా కావాలి. ఇప్పుడు నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.
ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్టు చుసిన అభిమానులు చైత్ర సడన్గా సీరియల్స్‌కు వదిలిపెట్టడానికి కారణం ఇదా అనుకుంటున్నారు. ఇక అష్టాచెమ్మా సీరియల్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగినా చైత్ర.. నేను సీరియల్స్ కు గుడ్ బై చెప్పడం లేదని, కేవలం కొద్దిరోజులు గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నానని చెప్పింది. అయితే ఎట్టకేలకు అసలు విషయాన్ని తాజాగా ఫొటోలతో సహా బయట పెట్టింది. త్వరలో తల్లి కాబోతున్న చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…