Parineethi Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన పరిణితి చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పరిణతి ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇది ఇలా ఉండగా తాజాగా పరణీతి చోప్రాకి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చడ్ఢాతో ఎంగేజ్మెంట్ జరిగింది.
శనివారం నాడు రాత్రి దిల్లీలోని రాఘవ్ స్వగృహంలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులతో పాటు మరి కొంతమంది సన్నిహితులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణతి చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులను అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు ఇలా రాఘవ్ ని నిశ్చితార్థం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మార్చి నెలలో పరిణీతి-రాఘవ్ లంచ్ డేట్‌లో కలిసిన తర్వాత వీరి గురించి డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇద్దరూ కలిసి కెమెరాకు చిక్కారు. అయినప్పటికీ వారి రిలేషన్ గురించి బయట పెట్టకుండా సీక్రెట్ మైంటైన్ చేశారు.
స్నేహితుడితో ఏడడుగులు వేయనున్న పరిణితి….
ఇలా గత కొంతకాలంగా వీరి మధ్య రిలేషన్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నప్పటికీ స్పందించకుండా ఒక్కసారిగా ఇలా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పరిణితీ-రాఘవ్ ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారని తెలుస్తోంది. అప్పటి నుంచే వీరు స్నేహితులుగా ఉన్నారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా పెళ్లి తేది గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…