AP: ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో భూ సర్వే నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కేంద్రం తీసుకు వచ్చినది. అయితే ఈ చట్టంలో భాగంగా భూములను రీ సర్వే చేసి ఎవరి భూమి వారికి ఇచ్చి ఇకపై భూ వివాదాలు లేకుండా కోర్టుకు కూడా వెళ్లకుండా అక్కడే పరిష్కారం చూపించే చట్టం.
ఇలా ఏపీలో తిరిగి భూములను రీ సర్వే చేయించడమే కాకుండా కొత్తగా మంజూరు చేసిన పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనినే తమకు అనుకూలంగా మార్చుకొని అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి మీ భూములను జగన్ లాగేసుకున్నారని అందుకే తన బొమ్మ వేశారంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి.
ఇలా జగన్ ఓడిపోవడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల దుష్ప్రచారం కూడా ఒకటని చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు సంతకం కూడా చేశారు. అంతే కాకుండా జగన్ హయాంలో సర్వేలు చేసి విడుదల చేసిన పాసు పుస్తకాలను కూడా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.
రాజముద్రతో పాస్ పుస్తకాలు..
ఎవరికైతే జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాలను మంజూరు చేశారో వారికి వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు రాబోతున్నాయని తెలిపారు. అయితే పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసివేసి అందులో ఆంధ్రప్రదేశ్ రాజముద్రను వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేకపోయినా ఉన్నట్టు చూపించడంతో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…