YS Jagan: జగన్ ఈ ఒక్క పని చేస్తే ఈసారి అధికారం తనదే.. తండ్రిని ఫాలో కావాల్సిందేనా?

YS Jagan: వైయస్ జగన్ 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఫలితాలను ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా 11 సీట్లకు పరిమితం కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక జగన్ ఇలా ఘోరంగా ఓటమి పాలు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఈయన కేవలం సలహాదారుడి సలహాలను నమ్మి ప్రజలకు దూరం కావటం, స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలవలేని పరిస్థితిలో ఉండటం వంటి ఎన్నో ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేస్తూ సలహాదారులే ఈ రాష్ట్రాన్ని శాసించారు.

స్థానిక ఎమ్మెల్యే అయినా సరే తమ నియోజకవర్గ సమస్యలు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలి అంటే అపాయింట్మెంట్ కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. ఇక వాలంటీర్లను నియమించడంతో గ్రామస్థాయిలో సర్పంచులకు కూడా ప్రాధాన్యత లేకపోవడంతో సర్పంచులందరూ ఈ విషయంపై ధర్నాలు కూడా చేయడం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారింది. ప్రతి ఒక్క విషయం వాలంటీర్లే కావడంతో సర్పంచులకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది.

రచ్చబండ కార్యక్రమం..
ఇలా సర్పంచ్లను స్థానిక ఎమ్మెల్యేలను జగన్ దగ్గరకు తీసుకొని ఆ గ్రామస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని ఉంటే ఈయనకు ఈ ఎన్నికలలో ఈ దుస్థితి వచ్చేది కాదు. తన తండ్రిలాగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇకనైనా జగత్ తన తండ్రిని ఫాలో అయితే వచ్చే ఎన్నికలలో అధికారం అందుకోవచ్చు లేదంటే ఆయనకు ప్రతిపక్ష హోదాని మిగులుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago