Pawan Kalyan: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల వారాహి అమ్మవారి దీక్ష వేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వేషధారణ మొత్తం మార్చేసారు. పసుపు రంగు దుస్తులను ధరించిన నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించారు. అంతేకాకుండా ఈ 11 రోజులు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం పండ్లు,ద్రవపదార్థాలను మాత్రమే తీసుకోబోతున్నట్లు తెలిపారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేసుకోవడంతో ఈయనకు ఉన్న భక్తి భావం చూసి ఎంతోమంది ఫిదా అయ్యారు. అయితే అమ్మవారి దీక్ష వేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. సాధారణంగా దీక్షలో ఉన్నవారు చెప్పులు వేసుకోరు కానీ పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని కనిపించడంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఇలా చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షలో ఉండటం ఏంటి మంత్రి గారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయంపై వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్‌కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీని మెప్పించడానికా..
ఇక ఈ విషయంపై నటి శ్రీరెడ్డి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండి చెప్పులు వేసుకున్న ఫోటోని ఆమె షేర్ చేసి బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈయన ఫోటో వైరల్ గా మారడంతో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…