Roja: సినీనటి రోజా రాజకీయాలలో కొనసాగుతున్న మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే .ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో అక్కడ ఉండే కమెడియన్స్ కి ఎంతో ప్రోత్సహించడమే కాకుండా వారికి వ్యక్తిగతంగా కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు.
ఇలా ఒకప్పుడు ఆమె నుంచి లాభం పొందిన కమెడియన్లు ఇప్పుడు ఆమెపై విమర్శలు చేయడమే కాకుండా తనని వదిలిపెట్టేది లేదంటూ వార్నింగులు ఇస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా కిరాక్ ఆర్పీ, షకలక శంకర్ హైపర్ ఆది వంటి వారు రెచ్చిపోయి మరి కామెంట్లు చేస్తున్నారు. అయితే రోజా గురించి ఈ స్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో రాకింగ్ రాకేష్ స్పందించారు.
ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ రోజా గారు జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే కమెడియన్లు అందరూ కూడా ఆమె కాళ్ళపై పడిన వారే,వంగి వంగి తనకు నమస్కారాలు చేసిన వారే ఆమె కేవలం ఒక జడ్జిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఎంతో సహాయం చేశారు ఆమె నుంచి జబర్దస్త్ కమెడియన్లు ఎంతో లాభం పొందారు.
అందరూ లాభపడ్డారు..
జబర్దస్త్ లో చేసే వారికి ఏదైనా సమస్య వస్తే తన సమస్యగా రోజా భావించి సహాయం అందించారు. అలాంటిది ఇప్పుడు వాళ్లే తనపై విమర్శలు చేయడం సరైనది కాదు అంటూ రాకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఏకీభవిస్తూ తనకు మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ కూడా రోజా చేతుల మీద ప్రారంభం చేసిన సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…