Categories: FeaturedMovie News

Hyper Aadi: రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న హైపర్ ఆది… ఆ పదవిలో కమెడియన్?

Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు సినిమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచిది సక్సెస్ అందుకున్న ఈయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హైపర్ ఆది తరచూ మెగా ఫ్యామిలీ భజన చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హైపర్ ఆదితో పాటు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతో దోహదపడ్డారు. ఇలా జనసేన పార్టీకి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హైపర్ ఆది త్వరలోనే రాజకీయాలలోకి కూడా రాబోతున్నారని తెలుస్తోంది.

ఇక హైపర్ ఆది జులై ఒకటో తేదీ అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈయనకు ఓ కీలక పదవి కూడా కట్టబెట్టబోతున్నారని సమాచారం. ఇన్ని రోజులు జనసేనకు ఎంతో కృషిచేసిన ఈయననీ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వబోతున్నారని సమాచారం.

ఎమ్మెల్సీ పదవిలో ఆది..
ఇలా హైపర్ ఆది జనసేన పార్టీలోకి వెళ్లడం ఎమ్మెల్సీ పదవులు అందుకోవడం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఆది తనకోసం జనసేన ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి తాను సిద్ధమే అంటూ కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago