Pavan Kalyan : జనసేన అధినేత నుండి పిఠాపురంలో ఇచ్చిన స్పీచ్ ను జనసైనికులు ఉహించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు తనకు అధికారం ఇవ్వమని కానీ సీఎంని చేయండి అని కానీ ఎపుడూ అనని జనసేనాని మొదటి సారి నన్ను సీఎంని చేయండి ప్లీజ్ అంటూ జనాలను కోరుకున్నారు. దోపిడీ దారులకు సీఎం సీటు ఇస్తే ఇలానే దోపిడీ చేస్తుంటారని, నేను బతికుండగా అలాంటి వారికి పదవి రాకుండా చేస్తానంటూ మాటిచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏపీ ని నెంబర్ వన్ చేస్తా దేశంలోనే అంటూ ప్రకటించారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసైనికులలో నూతనోత్సహం నింపారు.
గుండాలను రాష్టంలో లేకుండా చేస్తా…
పవన్ తన స్పీచ్ మొదలు పెడుతూనే నాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి సీఎంని చేయండి గుండాలు లేని రాష్ట్రాన్ని చూపిస్తా అంటూ చెప్పారు. ఇంకా ఆయన ప్రసంగిస్తూ… ఈ రోజు చెప్తున్నా నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తా. మీరు నాకు సంపూర్ణ అధికారం ఇస్తే సీఎం పదవి చేపడతా. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెపుతున్నా ఏపీని దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. నాకు అధికార పీఠం ఇవ్వండని నేను అర్థిస్తున్నా. నాకే భయాల్లేవు.. ముఖ్యమంత్రిని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. పిచ్చివాగుడు వాగితే, ఇళ్ళలో నుంచి లాక్కొచ్చి కొడతా అంటూ ఆవేశంగా ప్రశాంగించారు. జనసేన ప్రభుత్వం ఏర్పడితే గూండా కొడుకులకు నరకం చూపిస్తా. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, దత్తాత్రేయుడి సాక్షిగా కోరుతున్నా, నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి.
ఆ భగవంతుడికి తప్ప తాను ఎవ్వరికీ భయపడను అంటూ పవన్ తెలిపారు. దోపిడీ చేసేవాళ్లు మనల్ని పాలిస్తుంటే చిరాగ్గా ఉంది. పాపం పసివాడు, నోట్లో వేలుబెడితే కొరకలేడు అంటూ జగన్ గురించి పరోక్షంగా వెటకారం చేసారు. బాబాయిని చంపి నెత్తురు తుడుచుకొని, నోట్లో వేలుబెట్టుకొని కూర్చున్నాడు. నేరచరిత్ర ఉన్నవాడిని ఎన్నుకుంటే తుపాకులే తీస్తాడు. నేను బతికున్నంత కాలం నేరచరిత ఉన్నవాడు గద్దెనెక్కడానికి వీల్లేదు. ఏపీ బాగుపడాలంటే మన కులపోడా అనికాదు, మనకు సరైనోడా కాదా అనేది చూడాలి అంటూ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…