Featured

Pavithra Lokesh : ఆ ఇద్దరూ అంటే చాలా ఇష్టం.. మొదటి క్రష్ అతడే.. ఆయన నా పక్కన ఉంటే నార్మల్ గా ఉండలేను : పవిత్రా లోకేష్

Pavithra Lokesh : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్రా లోకేష్ ఈ మధ్య సినిమాలతో కంటే తన వ్యక్తిగత జీవితంలోని సంఘటనల వల్ల బాగా వైరల్ అయింది. కన్నడ ఆర్టిస్ట్ అయిన పవిత్రా లోకేష్ కన్నడ సీనియర్ నటుడు మైసూర్ లోకేష్ కూతురు. అలా వారసత్వంగా సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన పవిత్రా లోకేష్ కన్నడలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసింది. అయితే హీరోయిన్ గా అవార్డులు అందుకున్నా అవకాశాలను మాత్రం అందుకోలేక పోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించింది.

వాళ్లిద్దరూ అంటే చాలా ఇష్టం…

సినిమాల్లో నటించే సమయంలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీరు ను పెళ్లాడిన పవిత్ర అతనితో విడిపోయి ఆ తరువాత కన్నడ ఆర్టిస్ట్ ను పెళ్లాడింది, వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల తెలుగు సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనము చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పవిత్ర లోకేష్ కి అసలు నిజజీవితంలో ఇష్టమైన హీరోలు ఎవరు అనే విషయాన్ని ఇటీవల చెప్పింది. అదికూడా వాళ్లంటే చాలా క్రష్ ఉండేది, నా పక్కన అయన ఉంటే ఏమి జరుగుతుందో తెలియదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసారు. ఇంతకీ పవిత్ర లోకేష్ మనసుదోచుకున్న ఆ నటులు ఎవరంటే… టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఆయనంటే చాలా మంది అమ్మాయిలకే కాదు చాలా మంది హీరోయిన్స్ కి కూడా ఇష్టమే.

ఇక ఈ లిస్టులో పవిత్ర లోకేష్ కూడా ఉంది. నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమాను తాను ఆరవ తరగతి చదివే సమయంలో చూసి అప్పటి నుండి నాగార్జున అంటే ఇష్టమని ఇలాంటి వ్యక్తి నా జీవితంలో వస్తే బాగుండు అంటూ అప్పట్లో అనుకుండేదానిని అంటూ దాన్ని క్రష్ అంటారో ఏమంటారో తెలియదు అంటూ చెప్పింది. ఇక ఆయనే కాదు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అన్నా కూడా చాలా క్రష్ అంటూ చెప్పింది. ఆయనతో చాలా సినిమాల్లో నటించాను కానీ అయన దగ్గరగా ఉంటే నార్మల్ గా ఉండలేను ఆయనంటే చాలా గౌరవం అందుకే దూరంగా వెళ్లి కూర్చుంటాను అంటూ తన క్రష్ ల గురించి మనసులోని మాట బోల్డ్ గా చెప్పేసింది పవిత్రా ఆంటీ…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago