Naresh -Pavitra Lokesh: సీనియర్ సినీ నటుడు నరేష్ ఇటీవల కాలంలో సినిమాల పరంగా కంటే వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. సీనియర్ దివంగత నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు..ఇక ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలలో నటిస్తూ ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎన్నో వివాదాలలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న నరేష్ తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి విడిపోయారు. ఇలా వారితో ఉన్న మనస్పర్ధలు కారణంగానే విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా ముగ్గురు భార్యలను దూరం పెట్టిన నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు.
నటి పవిత్ర లోకేష్ తో కలిసి రిలేషన్ లో ఉన్నటువంటి నరేష్ తనని పెళ్లి కూడా చేసుకున్నారు ఈ విషయంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గతంలో సంచలనమైన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ జంటకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ వయసులోకి కూడా మీరిద్దరూ పిల్లలని కావాలనుకుంటున్నారా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలను కనడమే మా ఉద్దేశం కాదు.ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ ఉన్నాయని తెలిపారు.
పిల్లలు అవసరం లేదు..
ఇక ఈ విషయం గురించి నరేష్ కూడా మాట్లాడుతూ ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పవిత్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఐదుగురు మా పిల్లలేనని తెలిపారు. ఇప్పటికీ మేము పిల్లల్ని కనడానికి ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఫిట్ గా ఉన్నాము కానీ మాకు అవసరం లేదని తెలిపారు. మేము ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి 20 వచ్చేలోపు మా వయసు 80 సంవత్సరాలు అవుతుంది. అందుకే మా అమ్మ కృష్ణ గారి లాగే నేను పవిత్ర కూడా ఉండిపోవాలనుకున్నాము అంటూ ఈయన వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…