జనసేన పార్టీ అంతర్గత సమావేశం తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో కీలక నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పార్టీ నేతలు స్పందించకపోవడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
లేడీస్ డ్రెస్సులు, సినిమా వ్యాఖ్యల వంటి అంశాలపై వెంటనే స్పందించే నేతలు… కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ నిలదీశారని సమాచారం. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ను ఉద్దేశించి చేసినవిగా రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. సినిమాలకు సంబంధించిన వివాదాలపై వీడియోలు చేయడానికి సమయం దొరుకుతుందని, కానీ రాష్ట్ర ప్రజలను కదిలించిన అంశంపై మాట్లాడేందుకు సమయం లేదా అని పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదే సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై కూడా పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఎంపీగా ఉండి అందుబాటులో లేకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు. వ్యక్తిగత పనులు, విదేశీ పర్యటనలకు సమయం దొరుకుతుందని, కానీ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నేతల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పదవులు అనుభవించేందుకు కాదు, బాధ్యతగా పనిచేయడానికేనని స్పష్టంగా చెప్పిన పవన్, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నాయకులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, బహిరంగ వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోందని, దానికి సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో జనసేన విఫలమైందని పవన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా వింగ్ మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో పవన్ చూపిన ఆగ్రహం, చేసిన హెచ్చరికలు జనసేనలో క్రమశిక్షణ మరింత కఠినంగా మారబోతుందన్న సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నేతలు ఇకపై ప్రజా అంశాలపై మరింత స్పష్టంగా, దూకుడుగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…