Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా మౌనంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఈయన మోడీ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా వారణాసిలో తన భార్యతో కలిసి కనిపించారు.
ఇలా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజీనోవాతో కలిసి పలు ఆలయాలను సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఈయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారనే విషయాలు మాత్రం తెలియడం లేదు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. ఎంతో ఎండలో కూడా ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంతో అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈయన ఎలాంటి వెకేషన్ కి వెళ్లకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం.
గెలుపు పై ధీమా లేదు…
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత గెలుపు కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు తామే గెలుస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ అయ్యారు. ఇలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఈయన మౌనంగా ఉన్నారనే విషయాలు అందరికీ సందేహాలను కలిగిస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…