Jhanvi Kapoor: సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఒకప్పుడు ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండేవారు అయితే ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఎక్కువగా గుళ్లు గోపురాలు అంటూ ఆలయాలను సందర్శించడమే కాకుండా మన హిందూ సాంప్రదాయాలను కూడా ఎంతో చక్కగా పాటిస్తారు అనే విషయాలు మనకు తెలిసినదే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. తన తల్లి శ్రీదేవి ఎన్నో మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించేవారు.
అమ్మ ఉన్నప్పుడు తాము ఇలాంటి పద్ధతులను అసలు పాటించే వాళ్ళం కాదని తెలిపారు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ పాటించే కొన్ని కట్టుబాట్లను తాను కూడా పాటిస్తున్నానని తెలిపారు. అమ్మ ఉన్నప్పుడు శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించేది కాదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేవారు. అప్పుడు మేము ఈ మాటలను కొట్టి పారేసే వాళ్ళం కానీ ఇప్పుడు తాను శుక్రవారం జుట్టు కట్ చేయనని తెలిపారు.
తిరుమల శ్రీవారు..
ఇకపోతే శుక్రవారం ఎప్పుడూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదని అమ్మ చెప్పేది తాను ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నానని జాన్వీ తెలిపారు. ఇక అమ్మ ఎప్పుడు తిరుమల శ్రీవారిని నారాయణ నారాయణ నారాయణ అంటూ తలుచుకుంటూ ఉండేది. ప్రతి ఏడాది తన పుట్టినరోజు అమ్మ తిరుపతి వెళ్ళేది అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజు నాడు మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాము అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…