Pawan Kalyan: అతని బాధ భరించలేక గ్లాస్ డైలాగు చెప్పాను.. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు అయితే ఇటీవల ఊహించని విధంగా ఈయన నటించిన ఉస్తాద్ సినిమా నుంచి చిన్నపాటి టీజర్ వీడియోని విడుదల చేశారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో కనిపించారు. అంతేకాకుండా ఒక సన్నివేశంలో గ్లాస్ కిందకు పడేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేసాయి.

ఓ సన్నివేశంలో గ్లాస్ కింద పడేస్తూ గ్లాస్ పగిలే కొద్దీ దానికి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో పేలాయి. అయితే ఈ డైలాగ్ చెప్పడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని కానీ హరి శంకర్ బాధ చూడలేకే తాను ఈ డైలాగ్స్ చెప్పానంటూ పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్స్ గురించి వివరణ ఇచ్చారు.

పిఠాపురంలో నిర్వహించినటువంటి ఓ సమావేశంలో భాగంగా ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. హరీష్ నాకు కథ చెప్పేటప్పుడు ఈ సీన్ ఎందుకు పెడుతున్నావు అని అడగగా చాలామంది మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది సర్ కానీ గాజు గ్లాస్ లక్షణం ఏంటో తెలుసా అది పగిలేకొద్ది పదును ఎక్కువ అందుకే ఈ డైలాగ్స్ పెడుతున్నాను అంటూ ఆయన చెప్పారని పవన్ తెలిపారు.

పార్టీ ప్రచారం కోసమా
ఇలాంటి డైలాగ్స్ చెప్పడానికి నేను పెద్దగా ఇష్టపడను నాకు సినిమాలలో ఈ విధమైనటువంటి డైలాగ్స్ నచ్చవు కానీ హరీష్ శంకర్ బాధ చూసి తాను చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఇది సినిమా ప్రమోషన్ల కోసం చేసినట్టు లేదని కేవలం తన పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం చేసినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.