Movie News

Pawan Kalyan: భీమ్లా నాయక్ సినిమాకు 30 కోట్లు నష్టం వచ్చింది… సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈయన నిప్పులు చేరుగుతూ మాట్లాడుతున్నారు. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై చూపిస్తున్నటువంటి వివక్షత గురించి మాట్లాడారు.. కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మిస్తే ఆ సినిమాలకు కేవలం 10, 20 రూపాయలు టికెట్ల రేట్లు నిర్ణయించడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఇదివరకే చాలామంది ఈ విషయంపై మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్య చేపట్టిందని తెలిపారు. దీంతో తాను నటించిన సినిమాలు విడుదలవుతున్న సమయంలో పూర్తిగా టికెట్ల రేట్లు తగ్గించి ఆర్థికంగా నన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు.ఇక తాను నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండు చాలా మంచి సక్సెస్ అందుకున్నాయి కానీ ఈ సినిమాలకు ఏపీలో బయ్యర్లకు చాలా నష్టాలు వచ్చాయని తెలిపారు.

Pawan Kalyan: రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చారు…

ఇక భీమ్లా నాయక్ సినిమాకు భారీగా టికెట్ల రేట్లు తగ్గించడంతో ఏపీలో 30 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఆ నష్టాలు అన్నింటినీ తానే భరించానని ఉద్దేశపూర్వకంగానే ఏపీ సర్కార్ తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ రాత్రికి రాత్రి టికెట్ల రేట్లు తగ్గించినట్లు జీవో తీసుకువచ్చారని తెలిపారు.ఈ విధంగా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago