Movie News

Sobhitha Dhulipala: ఆ వార్తలను పెద్దగా పట్టించుకోను… కాబోయే వాడు అలాగే ఉండాలి: శోభిత ధూళిపాళ్ల

Sobhitha Dhulipala: శోభిత ధూళిపాళ్ల గత కొన్ని రోజులుగా నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ ఎదుర్కొంటూ వార్తలలో నిలుస్తున్నారు. ఇలా నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ ద్వారా ఈమె తరచూ వార్తలో నిలవడమే కాకుండా ఎప్పటికప్పుడు ఈ వార్తలపై స్పందించినప్పటికీ తరచూ ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈమె గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.

వీరిద్దరూ కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్లో కలిసి ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శోభిత ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శోభిత తనకు కాబోయే వాడి గురించి తనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాల గురించి తెలియజేశారు.

తనని పెళ్లి చేసుకునేవాడు చాలా సింపుల్ గా ఉండాలని ఆకాంక్షించారు.ఇతరుల పట్ల దయ జాలి కలిగి ఉండాలని తెలిపారు.మన జీవితం చాలా చిన్నది జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాలి అని తెలిసిన వ్యక్తి అయితే చాలని ఈమె తెలియజేశారు. ఇక నన్ను పెళ్లి చేసుకునేవాడు ప్రకృతిని కూడా ప్రేమించాలని తెలిపారు. ఈ విధంగా తనకు కాబోయే వాడి గురించి శోభిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Sobhitha Dhulipala: నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది..


ఈ క్రమంలోనే నాగచైతన్యతో వస్తున్నటువంటి డైటింగ్ రూమర్ల గురించి ప్రశ్న తలెత్తగా ఈమె ఈ వార్తలపై స్పందిస్తూ తాను అలాంటి వార్తలను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు. నేను ఎన్నో ఆడిషన్స్ చేస్తేనే హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నానని,ప్రతిక్షణం నా పనిలో కష్టపడుతూ ఉన్నానని తెలిపారు. ఇక ఎవరైనా తన గురించి మాట్లాడాల్సి వస్తే తన సినిమాల గురించి తన పని గురించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా శోభిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago