జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండింటినీ బ్యాలెన్స్ చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతడు రాజకీయాలను పక్కన పెట్టేసి.. సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అసవరం అనుకుంటే.. అటు వైపు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు.
అయితే అతడికి అభిమానులు అంటే ఎక్కడ లేని ప్రేమ. అభిమానికి కష్టం వచ్చిందంటే చాలు.. క్షణాల్లో అక్కడ వాలిపోతాడు. తనకు తోచిన సహాయం చేస్తూ.. పోత్సహిస్తుంటారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం అభిమానులే కారణం అంటూ ఎన్నో సార్లు చెప్పాడు. ఇటీవల రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతడి మాటలకు ఒక్కసారిగా రాజకీయాల్లో పెను సంచలనం స్పష్టించాడు.
చాలా రోజుల వరకు పవన్ మాట్లాడిన మాటల గురించే చర్చ జరిగింది. ఇదిలా ఉండగా.. అతడి వీరాభిమాని కృష్ణ జిల్లా లింగాలకు చెందిన భార్గవ్ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో బాధడపుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతడు కోలుకోవాలని.. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కింద రూ.5లక్షలు సహాయం చేశాడు.
అయితే అప్పటికే అతడి ఆరోగ్యం క్షీణించడంతో అతడి సహాయానికి ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా అతడు చనిపోయాడు. ఈ వార్త విన్న పవన్, అతడి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. అశ్రునివాళి అర్పించారు.
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…