Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హోం శాఖ మంత్రి..
ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…