సంచలనమైన నిర్ణయాలు, సెన్సేషనల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అంటే అతిశయోక్తి కాదు. ఫ్యాన్స్ లో వర్మ అంటే క్రేజ్ పెరగడానికి గల కారణం వర్మ దేని గురింనైనా ఎవరి గురించైనా కుండ బ్రద్ధలు కొట్టినట్టు మాట్లాడటం అతని స్టైల్. తన మనసుకు ఏదనినిపిస్తే అది చెప్పేస్తాడు. తన మనసుకు నచ్చిందే చేస్తానంటాడు. అందుకే సోషల్ మీడియాలో వర్మ చుట్టూ వివాదాలు తిరుగుతూనే వుంటాయి.
ఇక ప్రస్తుత విషయానికొస్తే కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్న పరిస్థితుల్లో టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.! కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. కరోనాని సైతం లెక్క చేయకుండా వృత్తికే అంకితమైన వర్మ సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు. ఒక సినిమా తర్వాత మరొకటి ట్రైలర్స్ రిలీజ్ చేస్తూనే అందరికి షాక్ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈమధ్య వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ.. 24 గంటలు సోషల్ మీడియాలోనే కనబడుతున్నాడు వర్మ. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మీద సంచలనమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకొచ్చాడు వర్మ.
ఓ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరి గురించి వర్మ చర్చిస్తూ.. “నా దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరు కాని.. ఫ్యూచర్ సీఎం అంటే మాత్రం పవన్ కళ్యాణే. అతని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వెరీ టఫ్ & యునిక్. వన్ పీస్ అతడు. ఈ ఒక్కమాటలోనే పవన్ కళ్యాణ్ సింగిల్ పీస్ అంటూ తెగ పొగిడేశారు వర్మ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్నే చేశారు వర్మ. చివరిగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ.. “టాలీవుడ్ లో మూవీస్ పరంగా చిరంజీవి అంటే చాలా ఇష్టం. పొలిటీషియన్‌గా మాత్రం కాదు” అని తెలిపారు వర్మ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…