తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతకాలం విరామం తర్వాత సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించగా సినిమా టైటిల్ కూడా ఇదే ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ “భీమ్లా నాయక్” అంటూ చిత్రబృందం ఆదివారం ఉదయం తెలియజేయడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఆగస్టు 15 సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు. ఇందులో పవర్ స్టార్ మాస్ లుక్ లో లుంగీ కట్టీ “ఒరేయ్ డేనీ.. బయటకు రారా.. ” అంటూ పవర్‌స్టార్ పవర్‌ఫుల్ ఎంట్రీ అభిమానులకు కిక్కేకిస్తోందని చెప్పవచ్చు. ఇందులో . ‘డేని.. డేనియల్ శేఖర్’అని రానా చెప్పగా… భీమ్లా ..భీమ్లా నాయక్ అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగులు కేక పుట్టిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ గ్లింప్ విడుదల చేస్తూ ఈ సినిమాకు “భీమ్లానాయక్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…