Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భారీ ర్యాలీతో ఈయన నామినేషన్ వేశారు అయితే ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి ఈయన నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను అలాగే అప్పుల వివరాలను కూడా వెల్లడించారు.
ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ కేవలం 114 కోట్ల రూపాయలను మాత్రమే సంపాదించినట్లు ఇందులో పేర్కొన్నారు. అంతే కాకుండా అప్పులు సుమారు 64 కోట్ల వరకు ఉన్నాయని ఈ ఎన్నికల ఆఫీడవిట్ లో పేర్కొన్నారు. అయితే ఈయన లోన్లు మాత్రమే కాకుండా కేవలం వ్యక్తుల దగ్గర చేసిన అప్పు 47 కోట్ల వరకు ఉంది.
ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ తన వదిన, మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ దగ్గర కూడా రూ.2 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఇందులో పేర్కొన్నారు. అయితే తన వదిన వద్ద మాత్రమే కాకుండా పలువురు నిర్మాతల వద్ద కూడా పవన్ కళ్యాణ్ అప్పు చేసినట్లు పేర్కొన్నారు. మరి ఏ నిర్మాతల వద్ద ఈయన అప్పు చేసారు అనే విషయానికి వస్తే..
నిర్మాతల వద్ద అప్పు..
పవన్ కళ్యాణ్ హారిక అండ్ హాసిని సంస్థకి 6 కోట్ల బకాయిలు ఉన్నారు. నిర్మాత నవీన్ యర్నేని, మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి పవన్ 8 కోట్లకి పైగా అప్పు ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కూడా పవన్ కళ్యాణ్ 10 లక్షలు అప్పు ఉన్నట్లు నామినేషన్ లో పొందుపరిచారు. అలాగే ఈయన టాక్సుల రూపంలో ఏకంగా 70 కోట్ల రూపాయల వరకు చెల్లించినట్లు ఇందులో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…