Barelakka: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మే 13వ తేదీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో మరోసారి రాజకీయ వేడుక రాజుకుంది.
ఇకపోతే ఈ ఎన్నికలలో భాగంగా మరోసారి బర్రెలక్క ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు వెల్లడిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఈమె అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తూ ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క కేవలం 5000 ఓట్లు మాత్రమే సాధించారు.
ఈ విధంగా గత ఎన్నికలలో ఓటమి పాలు అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా ఈసారి కూడా లోక్ సభ ఎన్నికలకు ఈమె పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భర్త వెంకటేష్ తో కలిసి ఈమె నామినేషన్ వేశారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష.
ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క..
ఎలాంటి హడావుడి, లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్పీ గట్టిగా మద్దతు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…