Categories: FeaturedMovie News

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాలలో పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్ చేశారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

గత ఎన్నికలలో భాగంగ పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలకంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఈయనకు మనస్పర్ధలు రావడం చేత పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ గురించి ఆరోపణలు చేస్తూ మరోవైపు జనసేన పార్టీ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ 2019లో పొరపాటు జరిగింది. అయితే అదే పొరపాటు 2024లో జరగదని వెల్లడించారు. 2024లో తప్పకుండా జనసేన పార్టీ గెలుస్తుందని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించరని, పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటూ పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు…

వచ్చే ఎన్నికలలో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని తను ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడమే కాకుండా బీఫామ్ ను తీసుకొని నిలబడతానని పృథ్వీరాజ్  వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తారని ఈయన జనసేన పార్టీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత జనసేన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

5 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

6 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

7 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

8 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

8 hours ago