Prudhvi Raj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాలలో పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్ చేశారు.

గత ఎన్నికలలో భాగంగ పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలకంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఈయనకు మనస్పర్ధలు రావడం చేత పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ గురించి ఆరోపణలు చేస్తూ మరోవైపు జనసేన పార్టీ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ 2019లో పొరపాటు జరిగింది. అయితే అదే పొరపాటు 2024లో జరగదని వెల్లడించారు. 2024లో తప్పకుండా జనసేన పార్టీ గెలుస్తుందని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించరని, పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటూ పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు…
వచ్చే ఎన్నికలలో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని తను ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడమే కాకుండా బీఫామ్ ను తీసుకొని నిలబడతానని పృథ్వీరాజ్ వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తారని ఈయన జనసేన పార్టీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత జనసేన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


































