కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మనదేశంలో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన రెండు మూడు రోజులలో ఈ వైరస్ భారిన పెద్దవారి సంఖ్య తీవ్రంగా కలచివేస్తుంది. తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తున్నా.. ఆంధ్రలో మాత్రం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖలు రాజకీయంగా దుమారం రేగుతున్నాయి.
కరోనా ఎవరికైనా రావొచ్చు. నాకు కూడా రావొచ్చు.. రానున్న రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖలు రాజకీయంగా రచ్చ జరుగుతుంది. కరోనా కట్టడి చెయాయడం చేతకాక జగన్ చేతులెత్తేశారని విపక్షాలు ఎద్దేవచేస్తున్నాయి. మరోవైపు కరోనాను తక్కువ చేసి చూపించి, తమ చేతగానితనాన్ని బయటపెడుతున్నారని విమర్శలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజగా జగన్ చేసిన వ్యాఖలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనా వైరస్ కేవలం ఒక జ్వరం కాదని, అది ఊపిరితిత్తులను మింగేసే ఒక భయంకరమైన మహమ్మారి అని స్పష్టం చేస్తారు. ఇది ఊపిరితిత్తులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు జనసేనాని.
“మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 (కరోనా) సాధారణ జ్వరం కాదు. కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కావాలంటే ‘సైన్స్ న్యూస్’ లో వచ్చిన కథనం చదువుకోండి.”
-పవన్ కళ్యాణ్
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…