“బాహుబలి” తెలుగు చలన చిత్ర స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి. హీరో ప్రభాస్ ను జాతీయ నటుడిగా తీర్చిదిద్దిన చిత్రం. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఈరోజుకు రెండో భాగం (బాహుబలి 2) వచ్చి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నాడు ప్రభాస్. తన జీవితంలో అతిపెద్ద సినిమా బాహుబలి అని, ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం అని ప్రభాస్ తెలిపారు.
“దేశవ్యాప్తంగా బాహుబలి కేవలం సినిమానే కాదు… నా జీవితంలో అతిపెద్ద సినిమా ఇది.. నాకు గుర్తుండిపోయే అతిపెద్ద జ్ఞాపకాన్ని ఇచ్చిన రాజమౌళి, టీమ్, నా అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈరోజుతో బాహుబలి 2 ప్రేక్షకుల ముందు వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఆ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని” అంటూ ట్వీట్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…