Reviews

OG Movie Review : ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది.. మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూసిన సినిమా ‘ఓజీ’ (They Call Him OG) సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి వచ్చింది. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ముందస్తు ట్రైలర్, గ్లింప్స్‌లతో ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను రేకెత్తించింది. ఎమ్రాన్ హష్మీ తెలుగు డెబ్యూట్ చేసిన ఈ చిత్రం, పవన్ కల్యాణ్ యాక్షన్ అవతారంతో అభిమానులను ఆకట్టుకుందా? సుజీత్ ఫ్యాన్‌బాయ్ మైండ్‌సెట్‌తో సినిమా తీశాడా? అంచనాలకు తగ్గట్టు ఉందా? మొదటి రివ్యూల ప్రకారం, ఇది పవన్ ఫ్యాన్స్ కోసం మాస్ ఎంటర్‌టైనర్, కానీ కథ పరంగా సాధారణమే. మరిన్ని వివరాలు రివ్యూలో చూద్దాం.

కథ (OG Movie Story)

సత్య దాదా (ప్రకాష్ రాజ్) ముంబై కొలాబా పోర్టులో మాఫియా డాన్. అనుకోకుండా అక్కడికి ఒక కంటైనర్ చేరుకుంటుంది, దానిలో ఆర్‌డిఎక్స్ (విస్ఫోటకాలు) దాచి ఉంటుంది. దానికోసం మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) కుమారుడు జిమ్మీ (సుదేవ్ నాయర్) వస్తాడు. కానీ, కంటైనర్‌ను తీసుకెళ్లకుండా అడ్డుకున్న సత్య దాదా కొడుకు (వెంకట్)ను జిమ్మీ చంపేస్తాడు. సత్య దాదా కంటైనర్‌ను దాచేస్తాడు.

ఇస్తాంబుల్ నుంచి మిరాజ్ కర్ పెద్ద కొడుకు ఓమీ (ఇమ్రాన్ హష్మీ) కంటైనర్ కోసం ముంబైకి వస్తాడు. సత్య దాదా కుటుంబంపై ఎటాక్ చేస్తాడు. అప్పుడు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ముంబైలో అడుగుపెడతాడు. సత్య దాదాను తండ్రిగా చూసుకున్న ఓజీ ఎందుకు దూరంగా వెళ్లాడు? సత్య దాదా పెద్ద కోడలు గీత (శ్రియా రెడ్డి), ఆమె కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) పాత్ర ఏమిటి? ఓజీ భార్య కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) రోల్ ఏమిటి? సత్య దాదా, మిరాజ్ కర్ మధ్య శత్రుత్వం ఎలా పుట్టింది? ఓమీని అడ్డుకుని సత్య దాదా కుటుంబాన్ని ఓజీ ఎలా కాపాడాడు? ఏమి కోల్పోయాడు? చివరికి ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (OG Review Telugu)

పవన్ కల్యాణ్‌కు సుజీత్ ఒక వీరాభిమాని. ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. పవన్‌ను స్టైలిష్ యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేయడంలో సుజీత్ మాస్టర్‌క్లాస్ ఇచ్చాడు. కానీ, కథ పరంగా కొత్త అంశాలు లేవు. మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు కథ సాధారణంగానే అనిపిస్తుంది. సుజీత్ దర్శకుడిగా కంటే అభిమానిగా మారి, పవన్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫలితంగా, పవన్ స్వాగ్, హీరోయిజం, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.

పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ కళ్లు చెదిరేలా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీన్‌లు గూస్‌బంప్స్ ఇచ్చాయి. పవన్ కెరీర్ బెస్ట్ యాక్షన్ సీన్స్ ఇక్కడే ఉన్నాయి. కానీ, ఎమోషన్ పరంగా డిజప్పాయింట్. ప్రియాంక అరుల్ మోహన్‌తో ప్రేమ కథ సాధారణంగా ఉంది. అర్జున్ దాస్-శ్రియా రెడ్డి ఫ్లాష్‌బ్యాక్ ఎమోషన్‌ను తగ్గించింది. క్లైమాక్స్ హడావిడిగా ముగిసింది.

జపాన్, ముంబై సెట్టింగ్స్ బాగా ఉన్నాయి. కానీ, జపాన్, తమిళ్, మరాఠీ డైలాగులకు సబ్‌టైటిల్స్ లేకపోవడం సమస్య. ‘వాషి యో వాషి’ హైకు తెలుగు సబ్‌టైటిల్స్ లేవు.

తమన్ BGM అదిరిపోయింది. పవన్ ఎలివేషన్ సీన్స్‌లో ఆర్‌ఆర్ గ్రాండ్‌గా ఉంది. కెమెరా వర్క్ (రవి కె. చంద్రన్) టెక్నికల్‌గా హై స్టాండర్డ్. నిర్మాతలు డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఖర్చు తెరపై కనిపించింది.

పవన్ కల్యాణ్ కళ్లలో పొగరు, స్టైలింగ్ అదిరిపోయాయి. గన్, కటానా సీన్స్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఓజాస్ గంభీర పాత్రలో పూర్తిగా లీనమయ్యాడు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా స్టైలిష్‌గా, ధీటుగా నిలబడ్డాడు. ప్రకాష్ రాజ్ నటన, డైలాగ్ డెలివరీలో అనుభవం చూపించాడు. అర్జున్ దాస్ గొంతు గాంభీర్యం, శ్రియా రెడ్డి నటన ఆకట్టుకున్నాయి. రాహుల్ రవీంద్రన్, ఉపేంద్ర లిమయే, సుహాస్ అతిథి మెరిశారు. ప్రియాంక పాత్ర నిడివి తక్కువ కానీ బాగా చేసింది.

‘ఓజీ’ పవన్ కల్యాణ్ అభిమానుల కోసం వీరాభిమాని తీసిన సినిమా. కథ సాధారణంగా ఉన్నా, పవన్ బెస్ట్ లుక్స్, యాక్షన్ సీన్స్, ప్రజెంటేషన్ అదిరిపోయాయి. యాక్షన్ లవర్స్‌కు ధమాకా. ఫ్యాన్స్ హ్యాపీగా థియేటర్‌లకు వెళ్లవచ్చు.

రేటింగ్: 3.25/5.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago