గత ఏడాది నుంచి కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచంలోని వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ ప్రకటించడం పట్ల ఆయా దేశాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ నిబంధనలను సడలించారు.తాజా స్పెయిన్‌లో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేశారు. సుమారుగా ఆరు నెలల నుంచి ఇంటికే పరిమితమైన స్పెయిన్ దేశస్థులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
స్పెయిన్లో గతేడాది అక్టోబర్ నుంచి లాక్‌డౌన్ అమలులో ఉంది. ఈ క్రమంలోనే కరోనా కేసులు తగ్గడంతో నిబంధనలను తొలగించారు.దీంతో స్పెయిన్ లోని పలు ప్రాంతాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేశారు.ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
లాక్ డౌన్ తొలగించిన నేపథ్యంలో కొన్ని జంటలు వీధుల్లోకి వచ్చి పరస్పర ముద్దులు పెట్టుకున్నారు. కొందరు మాస్కులు లేకుండా సందడి చేశారు.బర్సిలోనాలో బీచ్‌లు జనాలతో కిక్కిరిశాయి. కొన్ని నెలలుగా మూతపడిన బార్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటికీబాలేరిక్ ఐలాండ్, క్యానరీ ఐలాండ్, నవర్రా, వాలెన్సియా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…